జల వివాదంపై కీలక నిర్ణయాలు తీసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై జలశక్తి కార్యాలయంలో జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దిల్లీలోని జలశక్తి కార్యాలయంలో జల్ శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా హాజరయ్యారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చ జరిగింది. దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

image జల వివాదంపై కీలక నిర్ణయాలు తీసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

1. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం

2. ⁠గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో కృష్ణ నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ కు అంగీకారం

3. ⁠శ్రీశైలం ప్రాజెక్ట్ మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం

4. ⁠ఇరు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి అధికారులు, సాంకేతిక నిపుణులతో కమిటీ నియామకం.. వారం రోజుల్లో కమిటీ నియామకం

5. ⁠ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయం.

సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ఏపీ నుంచి బనకచర్ల కడతామన్న ప్రతిపాదన భేటీలో రాలేదన్నారు. ఇది అపెక్స్ కమిటీ సమావేశం కాదని సీఎం స్పష్టం చేశారు. కృష్ణాజలాల వినియోగంపై నిపుణులు, అధికారులు, ఇంజినీర్లతో త్వరలో కమిటీ ఏర్పాటు చేసి దాని నివేదిక మేరకు తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

Share this content:

Post Comment

You May Have Missed