వందే భారత్.. ఎద్దును ఢీకొనేన్..
వందే భారత్ రైలు వరుస ప్రమాదాలతో వార్తల్లోకెక్కుతోంది ఎక్కువ వేగంతో తక్కువ సమయంలో తమ గమ్యస్థానానికి చేరవచ్చునని ఉద్దేశంతో ప్రజానీకం ఈ రైలును ఆశ్రయిస్తుంది మహబూబాబాద్ జిల్లాలోని తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మరో ఘటన చోటు చేసుకుంది.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు, 428/11 వద్ద పట్టాలపైకి వచ్చిన ఎద్దును ఢీకొట్టింది. ఈ ఢీకొనడంతో రైలు ఇంజిన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని.. విరిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే రైలును నిలిపివేశారు. సమీపంలోని రైల్వే స్టేషన్ అధికారులకు సమాచారం అందించగా, వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దెబ్బతిన్న ఇంజిన్ భాగాలకు.. రైలు పట్టాలపై అవసరమైన మరమ్మతులు చేపట్టారు. సుదీర్ఘ మరమ్మత్తుల అనంతరం.. రైలు సికింద్రాబాద్కు బయలుదేరింది. ఈ ఊహించని సంఘటన ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది.

Share this content:
Post Comment