చంద్రబాబు డ్రీమ్ నెరవేరుతుందా.. డ్రీమ్ గానే ఉండిపోతుందా..?
చంద్రబాబు డ్రీమ్ నెరవేరుతుందా.. డ్రీమ్ గానే ఉండి పోతుందా..?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలల ప్రాజెక్ట్ పీఫోర్ ను ప్రజల ముందుకు తెచ్చారు. పేదరికం లేని ఆంధ్రప్రదేశ్‌ను చూడాలన్నదే నా డ్రీమ్ అని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు .దానిలో భాగంగా సమాజంలో బాగా అభివృద్ధి చెందినవారు ..పేద కుటుంబాలను దత్తత తీసుకుంటారు .ఆ విధివిధానాలను ప్రభుత్వఅధికారులు రూపొందించారు. గ్రామాలలో పట్టణాలలో సభలు నిర్వహించి అర్హులను గుర్తిస్తారు.
- ఎల్పీజీ లేని కుటుంబం సంప్రదాయ ఇంధనాన్ని వాడుతున్న వారు..
- విద్యుత్ లేని కుటుంబం ఇంట్లో విద్యుత్ కనెక్షన్ లేని వారు
- ఆదాయం లేని కుటుంబం ఉద్యోగం, రెంట్, ఇంటరెస్ట్, పెన్షన్ వంటివి ఏదీ లేని వారు
- శుద్ధమైన తాగునీరు అందుబాటులో లేని కుటుంబం తాగునీరు తేవడానికి 30 నిమిషాల దూరం వెళ్లాల్సినవారు
- బ్యాంక్ ఖాతా లేని కుటుంబం కుటుంబంలో ఎవరికి బ్యాంక్ ఖాతా లేని వారు..
🌹వీటిలో ఒక సమస్య ఉన్న కుటుంబాలను బంగారు కుటుంబానికి గ్రామసభలో ఎంపిక చేస్తారు.
🔴 అనర్హతలు :
- భూమి 5 ఎకరాలకన్నా ఎక్కువ భూమి కలిగి ఉన్నవారు
- ప్రభుత్వ ఉద్యోగి కుటుంబంలో ఏ ఒక్కరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు
- పట్టణ ప్రాపర్టీ (Municipal Property) మున్సిపల్ ప్రాంతంలో ఆస్తి కలిగి ఉన్నవారు..
- ఆదాయపు పన్ను చెల్లింపు కుటుంబంలో ఎవరైనా Income Tax చెల్లిస్తూ ఉన్నవారు
- నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్న కుటుంబం Four-wheeler వాహనం ఉన్నవారు
- విద్యుత్ వినియోగం అధికంగా ఉండటం నెలకు సగటున 200 యూనిట్లకన్నా ఎక్కువ విద్యుత్ వాడుతున్నవారు.. 🌹 వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఆ కుటుంబాన్ని బంగారు కుటుంబముగా ఎంపిక చేయరు .ఒకవేళ ఎంపిక చేసిన ఆ తరువాత తొలగిస్తారు. , 🌹బంగారు కుటుంబముగా ఎంపికైతే కలిగే లాభాలు.. , 🎁ఆర్థిక సహాయం: ఎంపికైన బంగారు కుటుంబాల్లో ప్రముఖంగా పేదలకు ఆర్థిక సహాయం అంది స్తారు
🎁సొంత ఇల్లు లేని కుటుంబాలకు ప్రభుత్వం స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి సహాయపడ తారు
🎁ఉద్యోగం/ఉపాధి అవకాశాలు కల్పిస్తారు
🎁విద్యా సహాయం చేస్తారు..దాతల సహకారంతో ఎంతవరకైనా..చదివిస్తారు.
*🎁ఎంపికైన బంగారు *కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెడతారు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. చంద్రబాబు కల నెరవేరునుందా.. లేదా ..అనేది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాలని మేధావులు అంటున్నారు.


Share this content:
Post Comment