రెండవ శనివారం.. మమ్మల్ని వదిలేయండి రా బాబు..

తెలుగు రాష్ట్రాలలో..సెకండ్ సాటర్డే అనగా నెలలో రెండవ శనివారం సెలవును అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని సంస్థలు తూట్లు పొడుస్తున్నాయని విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. నెలలో ఒకరోజు విద్యార్థులు ఉపాధ్యాయులపై పని భారం తగ్గించాలని వారి మెదడుకు విశ్రాంతినివ్వాలన్న.. పెద్దల సూచనలతో ప్రభుత్వం రెండవ శనివారం సెలవు ఇస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో స్కూల్స్ కాలేజీల మధ్య పోటీ పోటీ వాతావరణం పెరిగిపోవడంతో సెలవు దినమును పని దినంగా మారుస్తున్నారని sfi,DYFI నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ను కలిసి ఫిర్యాదు చేశారు .రెండవ శనివారం పని దినంగా మార్చడం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని వారు తెలిపారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించక పోతే.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

Share this content:

Post Comment

You May Have Missed