స్కూల్.. లో మధ్యాహ్నం భోజనం బాలేదు ..అంకుల్

ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు బాల కార్మిక వ్యవస్థ ను తగ్గించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం ఆచరణలో నీరుగారి పోతోంది .ప్రభుత్వం ఎంత పకడ్బందీగా అమలు చేయాలనుకున్న అది స్కూలు స్థాయిలో అమలు కానీ పరిస్థితి ఏర్పడింది.దీని ద్వారా ప్రజల సొమ్ము వృధాగా పోతోందని విద్యార్థి లోకం అంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూలు మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. కేంద్ర సహాయముతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పౌష్టికాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 22.5 లక్షల స్కూలు విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందుతున్నారనీ విద్యా శాఖ అధికారులు అంటున్నారు.

85.5 కోట్ల రూపాయల ఖర్చు

అదేవిధంగా జూనియర్ కళాశాలలో 1,48,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం దీనికి 85.5 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు .ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనతో ఈ పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం గా నామకరణం చే సీనట్లు మానవ వనరుల మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యార్థులకు ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలు , సెంట్రల్ కిచెన్లతో ఒప్పందం చేసుకుంటారు

Mid Day Meals – No


ఒప్పంద ప్రకారం వారు పిల్లలకు భోజనాన్ని  అందిస్తూ ఉంటారు . ఇది కొన్నిచోట్ల సజావుగా జరుగుతున్నప్పటికీ.. చాలాచోట్ల ఈ పథకం సరిగా అమలు జరగడం లేదనీ తల్లిదండ్రులు అంటున్నారు. ఏజెన్సీలు వండిన వంటను తినడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదని వారూ వాపోతున్నారు. నాసిరకం భోజన పదార్థాలు అందిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. వండే విధానం కూడా సరిగా ఉండడం లేదంటున్నారు .

ప్రభుత్వం నియమించిన మెనూ ఎక్కడ సక్రమంగా అమలు జరగడం లేదంటున్నారు ఏజెన్సీలు కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల నోటి దగ్గర కూడు లాక్కుంటున్నారంటున్నారు ఇటీవల మధ్యాహ్న భోజన పథకం పై ఫిర్యాదులు కూడా ఎక్కువయ్యాయని అధికారులు తెలిపారు.సమయానికి కూడా భోజనం ఏజెన్సీలు అందించడం లేదు అంటున్నారు.

స్కూల్ హెడ్మాస్టర్లు ఇచ్చిన లిస్టు ప్రకారం భోజన పదార్థాలు తీసుకువచ్చినప్పటికీ అవి తినేందుకు విద్యార్థులు ఎవరు ముందుకు రావడంలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు కోట్ల రూపాయలు ప్రజా ధనం వృధాగా పోతుందని వారు అంటున్నారు . వండిన ఆహారం అంతా మరల వంట ఏజెన్సీ లే వెనక్కి తీసుకువెళ్లి పోతున్నాయ అంటున్నారు.దీనిపై అధికారుల సమన్వయం కూడా కొరవడుతుందంటున్నారు . చాలాచోట్ల విద్యార్థులు ఆందోళనలకు దిగుతున్నారు. ఆందోళన నిర్వహించే విద్యార్థుల దగ్గరకు కనీసం ఏ అధికారి రావడం లేదని పేరెంట్స్ఆరోపిస్తున్నారు.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టే కంటే దానిని మెస్ ఛార్జీల రూపంలో తల్లిదండ్రులకు అందిస్తే పౌష్టికాహారం పెట్టడానికి వీలుంటుందని ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ చైర్మన్ అశోక్ అన్నారు. తల్లికి వందనం వేస్తున్నట్టే పిల్లల భోజన ఖర్చులకు కూడా ప్రతి నెల తల్లుల ఖాతాల్లో వేస్తే పిల్లలు మరింత ఆరోగ్యంగా ఉంటారని వారు అంటున్నారు ఏది ఏమైనా ఈ పథకం నూటికి 50 శాతం మందికి కూడా ఉపయోగకరంగా లేదన్నారు. ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం సక్రమంగా అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

screenshot_2025_0718_172553659572384350627486 స్కూల్.. లో మధ్యాహ్నం భోజనం బాలేదు ..అంకుల్
screenshot_2025_0718_1724537539869141347436972-300x192 స్కూల్.. లో మధ్యాహ్నం భోజనం బాలేదు ..అంకుల్
maxresdefault స్కూల్.. లో మధ్యాహ్నం భోజనం బాలేదు ..అంకుల్

Share this content:

Post Comment

You May Have Missed