బాబోయ్..ఊరిలోకి.. సముద్రం
సముద్రం ఊరిలోకి వచ్చింది.. ఇళ్ళు అన్నింటిని నేలమట్టం చేసింది .గ్రామస్తులు తేరుకునే లోపే చిందరవందర చేసి పడేసింది. ఇది ఎక్కడో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది.

కాకినాడ జిల్లా.. ఉప్పాడ కొత్తపల్లి మండలంలో..సముద్రం ఉన్నమాటున పొంగి ఊరిలోకి వచ్చేసింది. ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ మాయా పట్నం తదితర ప్రాంతాల్లో సముద్రం చొచ్చుకు వచ్చింది. చేపల వేటే జీవనోపాధిగా బ్రతికే మత్స్యకారులు నిలువ నీడ కోల్పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్రం ఉగ్రరూపం దాల్చినప్పుడల్లా మేము నష్టపోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని ప్రభుత్వాలు మారిన మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరూ లేరన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రద్ధ తీసుకుని మా ముంపు సమస్యపై పరిష్కరించాలన్నారు. లేకపోతే ఏదో రోజు పిల్లాపాపలతో సముద్రంలో కలిసిపోవడం జరుగుతుందన్నారు .సముద్రం నీటి అలలతో ఇల్లు వాటిలోని సామాన్లు అన్ని పోగొట్టుకుని వారు చేస్తున్న ఆర్తనాదం చూపర్లను కంటతడి పెట్టించింది.
Share this content:
Post Comment