ఏపీలో .. డిగ్రీ కాలేజీలు బంద్
డిగ్రీ కాలేజీలు ఈ నెల 21న బంద్..
రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈ నెల 21న బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అసోసియేషన్ మంత్రి లోకేశ్‌ను కలిసింది.వీరు పలు సమస్యలపై చర్చించినప్పటికీ, ఐదు నెలలు గడిచినా అధికారులుగా నిర్ణయాలను అమలు చేయలేదని అసోసియేషన్ ఆరోపించింది.
ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడినప్పటికీ, ఇప్పటికే రెండు నెలలు గడుస్తున్నా డిగ్రీ కాలేజీలలో అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించలేదని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం ను కోరింది. లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ తెలిపింది.
Share this content:
Post Comment