కుక్కలను పెంచుకుంటున్నారా? బి కేర్ ఫుల్

Kerala dog menace: కేరళలో వీధి కుక్కల బెడద తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కుక్క కాటు కేసులు, రేబిస్ మరణాలు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ పరిస్థితి మరింత దిగజారుతోంది. కుక్కకాటు, రేబిస్ మరణాలపై హైకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

రేబిస్ మరణాలు రాష్ట్ర విపత్తుగా ప్రకటించే అవకాశాలను పరిశీలించాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రజల్లో పెరుగుతున్న భయాందోళనలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు సరిపోవట్లేదని అభిప్రాయపడింది.

Stray_dogs-Reuters_1_1200x768 కుక్కలను పెంచుకుంటున్నారా? బి కేర్ ఫుల్

ఈ ఏడాది జనవరి నుండి ఏప్రిల్ మధ్య కాలంలో ఏకంగా 1.31 లక్షల మంది కుక్క కాటుకు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3.16 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు 25 మంది రేబిస్ కారణంగా మరణించారు.

2021 నుండి 2024 మధ్య 89 రేబిస్ మరణాలు సంభవించగా, వారిలో 18 మంది టీకాలు తీసుకున్న వాళ్లూ ఉండటం ఆందోళనకంగా మారింది. ప్రత్యేకించి- కొట్టాయం, తిరువనంతపురం, పథనంథిట్ట జిల్లాల్లో కుక్క కాటు తీవ్రంగా ఉంటోంది. ముగ్గురు పిల్లలు మరణించారు. దీంతో సీనియర్ అడ్వొకేట్ కళత్తూర్ జైసింగ్ రంగంలోకి దిగారు.

రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరి నుండి మే మధ్య కాలంలో రేబిస్ కారణంగా 16 మంది మరణించగా.. వారిలో అయిదుమంది ముందు జాగ్రత్తగా టీకాలు తీసుకున్నారని ఆరోగ్య శాఖ నివేదిక తెలిపింది. ఈ సంవత్సరం కుక్క కాటుతో మరణించిన వారిలో తొమ్మిది మందికి టీకాలు వేసినట్లు గుర్తించారు.

The-overall-pathogenesis-and-spread-of-rabies-virus-from-the-site-of-bite-to-brain-and కుక్కలను పెంచుకుంటున్నారా? బి కేర్ ఫుల్

వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల టీకాలు పనిచేయట్లేదని అధికారులు భావిస్తున్నారు. రేబిస్ వైరస్‌లో మార్పులు సంభవించి ఉండవచ్చని, ప్రస్తుత టీకాలకు వాటికి అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీధి కుక్కల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన నిధులను స్థానిక సంస్థలు సరిగ్గా వినియోగించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి.

రెండేళ్లలో రూ. 98.93 కోట్ల నిధులను కేటాయించగా.. ఇందులో రూ. 13.59 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, దీనివల్ల సమస్య మరింత తీవ్రమైందని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో వీధి కుక్కల నిర్వహణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రీవెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ రూల్స్ 2023లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం.

Share this content:

Post Comment

You May Have Missed