పెళ్లి మీకు.. అప్పులు మాకు..

పెళ్లిళ్ల సీజన్ మళ్లీ వచ్చేసింది. ఆసాడ మాసం ముగియను ఉండడంతో.. పెళ్లి బాజాల సవ్వడి మొదలుకానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో భారీ ఖర్చుతో వివాహాలు చేయడం పేషన్ గా మారిపోయింది. దీంతో వ్యాపారాలు కూడా ఊపందుకున్నాయి .బంగారు వస్త్ర దుకాణాలు పెళ్లి కుటుంబాలతో కిటకిటలాడుతున్నాయి. పెళ్లిళ్లను తరతరాలు గుర్తుండిపోయేలా చేసే ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు క్షణం తీరిక లేకుండా పోయింది. ముహూర్తాలకు ఎక్కువ పట్టింపునిచ్చే తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు నెలలో ఎక్కువ పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని మ్యారేజ్ బ్యూరో సంస్థలు తెలిపాయి. ఈనెల 24 తో ఆషాడ మాసం ముగిసిపోతుందని తెలిపింది .

లేకపోతే వచ్చే సంవత్సరం వరకు పెళ్లిళ్లు వాయిదా

శ్రావణమాసం రాగానే ఈనెల 27 నుండి వచ్చేనెల అనగా ఆగస్టు 20 వరకు వివాహ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.ఈ ముహూర్తాలు మిస్ అయితే నవంబర్ వరకు మరల ముహూర్తమే లేదని వారన్నారు .లేకపోతే వచ్చే సంవత్సరం వరకు పెళ్లిళ్లు వాయిదా వేయాల్సి వస్తుందని వారంటున్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు మరల ముహూర్తాలు లేవని..అందుకే పెళ్లిళ్లకు కంగారు పడుతున్నారన్నారు.అందుకే ఈ నెల 27 నుండి ఆగస్టు 20 వరకు వెడ్డింగ్స్ ప్లాన్ చేసుకుంటున్నారని వారన్నారు. వివాహాల మాట ఎలా ఉన్నా కుటుంబాలు సభ్యులు మాత్రం నలిగిపోతున్నారు.

నేటి యువతీ యువకులు డిఫరెంట్ గా వెద్దింగ్స్ చేసుకోవాలని ఆలోచనతో లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నారు. దీంతో పెళ్లి పేరు చెప్పి సరదా సందడి అంతా బంధువులదని.. అప్పులు మాత్రం వధూవరుల కుటుంబాలకు మిగులుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.

maxresdefault పెళ్లి మీకు.. అప్పులు మాకు..
maxresdefault పెళ్లి మీకు.. అప్పులు మాకు..

Share this content:

Post Comment

You May Have Missed